Australia Playing 11 India for World Cup Final 2023: భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ వేదికగా జరిగే టైటిల్ ఫైట్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. మెగా టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా.. అదే జోరులో ఆసీస్‌ను ఓడించి టైటిల్ పట్టాలని చూస్తోంది. మరోవైపు అనూహ్యంగా పుంజుకొని వరుసగా 8 విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఆసీస్.. ఆరోసారి టైటిల్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే భారత స్పిన్‌ను ఎదుర్కొనేందుకు ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తుది జట్టులో ఓ వ్యూహాత్మక మార్పు చేసే అవకాశం ఉంది.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ఓ మార్పు చేసే అవకాశం ఉందని తెగలుస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను తప్పించి.. అతని స్థానంలో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ ఆసీస్ మేనేజ్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. లబుషేన్ స్పిన్ బౌలింగ్‌ను పెద్ద ఆడకపోవడమే ఈ మార్పుకు కారణం. స్టోయినీస్‌కు భారత కండిషన్స్‌పై మంచి అవగాహన ఉండటం, ఆసీస్‌కు ఎక్స్‌ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ లభించనుండటం అతనికి కలిసొచ్చే అంశాలు. భారత పిచ్‌లకు తగ్గట్లు స్లో బాల్స్, కట్టర్స్ వేయడమే కాకుండా.. బ్యాటింగ్‌లో విధ్వంసకరంగా ఆడగలడు. ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండటం కూడా అతనికి అదనపు బలం.
ఈ ఒక్క మార్పు తప్ప ఆస్ట్రేలియా తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ ఆడనుండగా.. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీష్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. లోయరార్డర్‌లో మార్నస్ స్టోయినీస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడమ్ జంపా.. పేస్ కోటాలో జోష్ హజెల్ వుడ్ ఆడనున్నాడు.
Also Read: Miss Universe 2023: ‘మిస్ యూనివర్స్’గా షెన్నిస్ పలాసియోస్!
ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా):
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్ (కీపర్), మార్కస్ స్టోయినీస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్.