Site icon NTV Telugu

IND vs AUS: భారత బౌలర్లపై విరుచుకుపడ్డ ఆసీస్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

World Cup 2025

World Cup 2025

IND vs AUS: నవి ముంబయిలోని DY పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025 రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళల జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో కెప్టెన్ అలీస్సా హీలీ (5) త్వరగా ఔటవడంతో ఆస్ట్రేలియాకు తాత్కాలిక షాక్ తగిలినా.. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. ముఖ్యంగా ఫీబీ లిచ్‌ఫీల్డ్ మాత్రం దూకుడుగా ఆడింది. కేవలం 93 బంతుల్లోనే 17 బౌండరీలు, 3 సిక్స్‌లతో 119 పరుగులు చేసింది. ఇక మరోవైపు లిచ్‌ఫీల్డ్‌కు సీనియర్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ (77) అద్భుతమైన మద్దతు అందించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

Word of the Year: వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ’67’..ఎందుకంటే..?

ఇక మధ్య ఓవర్లలో కాస్త వికెట్లు కోల్పోయినా.. చివర్లో అష్లీ గార్డ్నర్ (63) హిట్టింగ్ తో ఆసీస్ స్కోరు వేగంగా పెరిగింది. ఆమె 45 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో దుమ్మురేపింది. ఇక చివరి ఓవర్లలో కిమ్ గార్త్ (17), టాహ్లియా మెక్‌గ్రాత్ (12) కూడా విలువైన పరుగులు జోడించడంతో జట్టు 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు ఆసీస్ దాడిని నిలువరించడానికి తీవ్రంగా శ్రమించినా, పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. శ్రీచరని 10 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ 9.5 ఓవర్లలో 73 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించింది. అలాగే క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్ చెరో వికెట్ తీశారు. అయితే, ఆసీస్ బ్యాటర్లు క్రమం తప్పకుండా బౌండరీలు సాధించడం వల్ల భారీ స్కోర్ చేసింది. దీనితో భారత్ ముందు 339 పరుగుల భారీ లక్ష్యం ఉంది. చూడాలి మరి
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి స్టార్ బ్యాటర్లు ఈ ఛేజ్‌ను ఎలా ముగిస్తారో.

Bihar Elections 2025: బీహార్‌లో హత్యా రాజకీయాలు.. ఎన్నికల ప్రచారంలో తూటాకు బలైన నాయకుడు

Exit mobile version