Income Tax Rules: ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) ప్రతిపాదించిన ‘ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు 2026’ (Income Tax Draft Rules 2026) క్రెడిట్ కార్డ్ వినియోగదారుల అలవాట్లను పూర్తిగా మార్చివేయనున్నాయి. 1962 నాటి పాత నిబంధనల స్థానంలో రానున్న ఈ కొత్త చట్టం.. పారదర్శకతను పెంచడం, పన్ను ఎగవేతను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ ముసాయిదాలోని 5 కీలక మార్పులు ఇలా ఉన్నాయి.
Budget Smartphones: కేవలం రూ.10000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
భారీ లావాదేవీలపై నిఘా:
కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిజిటల్ లావాదేవీలు జరిపితే, ఆ వివరాలను బ్యాంకులు నేరుగా ఆదాయ పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. అలాగే రూ. 1 లక్ష అంతకంటే ఎక్కువ నగదు చెల్లింపులు (Cash Payments) చేసినా ఐటీ శాఖ దృష్టికి వెళ్తాయి. దీనివల్ల భారీ ఖర్చులు చేసే వారి ఆదాయ వనరులపై నిఘా పెరుగుతుంది.
అడ్రస్ ప్రూఫ్‌గా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్:
కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇదొక ఊరటనిచ్చే అంశం. దరఖాస్తుదారు పేరు, సరైన చిరునామా స్పష్టంగా ఉన్న గత మూడు నెలల క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్లను ఇకపై చెల్లుబాటు అయ్యే చిరునామా ధృవీకరణ పత్రం (Address Proof)గా గుర్తించాలని ప్రతిపాదించారు. గ్యాస్ బిల్లులు లేదా ఇతర పత్రాలు లేని వారికి ఇది ఎంతో మేలు కానుంది.
Cooking Oil Prices: సామాన్య ప్రజలకు గుడ్న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు
క్రెడిట్ కార్డ్ ద్వారా ఆదాయ పన్ను చెల్లింపు:
ప్రస్తుతం పన్ను చెల్లింపులు నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డులకే పరిమితమై ఉన్నాయి. అయితే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా ఆదాయ పన్ను కట్టవచ్చు. ఇది పన్ను చెల్లింపుదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజులు లేదా వడ్డీ రేట్లను వినియోగదారులు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
ఆఫీస్ క్రెడిట్ కార్డుల వ్యక్తిగత వినియోగంపై పన్ను:
కంపెనీ ఇచ్చిన క్రెడిట్ కార్డును కేవలం ఆఫీస్ పనులకే వాడితే (బిజినెస్ ట్రావెల్, క్లయింట్ మీటింగ్స్) ఎలాంటి పన్ను ఉండదు. కానీ, ఆ కార్డును వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగిస్తే, ఆ మొత్తాన్ని అదనపు ప్రయోజనం (Perquisite)గా పరిగణించి పన్ను విధిస్తారు. దీనికోసం యజమానులు ఖర్చుల రికార్డులను పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ దరఖాస్తుకు పాన్ తప్పనిసరి:
ఇకపై పాన్ కార్డ్ లేనిదే క్రెడిట్ కార్డ్ దరఖాస్తులను బ్యాంకులు ఆమోదించవు. ప్రతి క్రెడిట్ కార్డ్ లావాదేవీని పన్ను రికార్డులతో అనుసంధానించడానికి, మోసపూరిత వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిబంధనను కఠినతరం చేశారు.
