NTV Telugu Site icon

Thandel : నాగచైతన్య “తండేల్ ” మూవీలో నటించనున్న బలగం హీరో..?

Whatsapp Image 2023 12 27 At 10.20.58 Pm

Whatsapp Image 2023 12 27 At 10.20.58 Pm

టాలీవుడ్‌ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ తండేల్ . చందూ మొండేటి డైరెక్షన్‌లో రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రేమమ్,సవ్యసాచి వంటి హిట్స్ తర్వాత తండేల్‌ చందూమొండేటి-చైతూ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం విశేషం.ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది..తాజాగా తండేల్‌ చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెట్టినట్టు అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగచైతన్య, ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్‌ లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఈ మూవీ లో బలగం హీరో ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. లేటెస్ట్ టాక్ ప్రకారం ప్రియదర్శి ఇందులో చైతూ స్నేహితుడి గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.ప్రియదర్శి కూడా షూట్‌లో జాయిన్ అయ్యాడని సమాచారం. కాగా దీనిపై మేకర్స్ అఫీషియల్ అప్‌డేట్ అయితే ఇవ్వాల్సి ఉంది. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన తండేల్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో చైతూ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.. లవ్‌స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య , సాయిపల్లవి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ బాగా పెరిగింది.శ్రీకాకుళం బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీ తో సాగే ఈ మూవీ లో సాయిపల్లవి శ్రీకాకుళం యాసలో పక్కా విలేజ్‌ గాళ్‌గా అలరించబోతుందని సమాచారం.. 2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ ఘటనల వస్తోన్న ఈ మూవీ చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. టాప్‌ బ్యానర్‌ గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Show comments