NTV Telugu Site icon

Maha Kumbh Mela 2025: మరోమారు మహా కుంభమేళాలో చెలరేగిన మంటలు

Fire

Fire

Maha Kumbh Mela 2025: నేడు (శుక్రవారం) ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. వార్త అందే సమయానికి మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకరాచార్య మార్గ్‌ లోని సెక్టార్-18లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీని కారణంగా అక్కడ ఉన్న అనేక టెంట్లు బూడిదయ్యాయి. టెంట్ కు మంటలు అంటుకున్న వెంటనే చుట్టుపక్కన ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. అయితే అక్కడ గాలి బలంగా వీస్తున్నందున, మంటలు వేగంగా వ్యాపించాయి.

Also Read: Nandini Rai : నేరేడు పళ్ళు.. నందిని రాయ్ కళ్ళు..

దాంతో, సమీపంలోని ఇతర గుడారాలలో నివసించే ప్రజలు బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని తెలుస్తోంది. అయితే, అగ్నిప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.