NTV Telugu Site icon

RR vs RCB: టాస్ గెలిచి ఆర్సీబీని బ్యాటింగ్ కు ఆహ్వానించిన రాజస్థాన్‌ రాయల్స్..

Rr Vs Rcb Eliminator

Rr Vs Rcb Eliminator

ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా నేడు రాత్రి 7:30 గంటలకు మొదలయ్యే ఎలిమినేటర్ మ్యాచ్ ఆమదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కు సంబంధించి టాస్ రాజస్థాన్ రాయల్స్ గెలవగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మొదటగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ ఐపీఎల్ హిస్టరీలో 30 మ్యాచ్లు ఆడగా అందులో రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచులు విజయం సాధించగా., బెంగుళూరు జట్టు 15 మ్యాచ్ లలో విజయం సాధించి ముందంజలో ఉంది.

ఇక నేటి మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలు చూస్తే.. ఆర్సీబీ XI లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్ లు ఉండగా సుబ్టిట్యూట్ గా స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేసాయి, వైషక్ విజయ్ కుమార్, హిమాన్షు శర్మలు ఉన్నారు.

ఇక మరోవైపు రాజస్థాన్ XI లో యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ లో ఉండగా సుబ్టిట్యూట్ గా నంద్రే బర్గర్, శుభం దూబే, డోనోవన్ ఫెరీరా, తనుష్ కోటియన్, షిమ్రాన్ హెట్మెయర్ లు ఉన్నారు.