NTV Telugu Site icon

Fake Appointment Letter: కరెంట్ ఆఫీస్​లో జాబ్ అంటూ నకిలీ అపాయింట్మెంట్ లెటర్.. చీటింగ్ కేసు నమోదు..

Fake Appointment Letter

Fake Appointment Letter

Fake Appointment Letter: కరెంట్ ఆఫీస్​లో జాబ్​ ఇప్పిస్తానని డబ్బులు గుంజి, ఆపై నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్​ పై నాగోల్ పోలీస్ స్టేషన్​ లో చీటింగ్ కేసు నమోదు చేసారు పోలీసులు. నాగోల్ మమతనగర్ ​కు చెందిన ఓ యువతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్​ కు ప్రిపర్ అవుతోంది. విద్యుత్ శాఖలో (టీజీఎస్పీడీసీఎల్) భువనగిరిలో జూనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న బండారపు కిరణ్ కుమార్ 2021లో ఆమెకు వేరేవారి ద్వారా పరిచయమయ్యాడు. ఈ సమయంలో యువతకి కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని, 2021 నుంచి 2024 వరకు విడతల వారీగా రూ.19.50 లక్షలు తీసుకున్నాడు.

AI Notes Writing: ఇకపై నోట్స్ రాయడం గురించి బయపడాలిసిన అవసరంలే.. ఏఐ మెషిన్ తనంతట తానే..

అయినా కానీ ఆమెకు ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తుండడంతో ఇటీవల యువతి అతనిని నిలదీసింది. దీంతో అతను అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చి ఇవ్వగా.. అది ఫేక్ అని తేలడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని మరోసారి గట్టిగా అడిగింది. ఈ విషయంలో పెద్ద మనుషులు జోక్యం చేసుకోవడంతో ఆరు నెలల్లో డబ్బులు ఇస్తానని అంగీకరించారు. ఆరు నెలలైనా డబ్బులు ఇవ్వకపోవడంతో నాగోలు పోలీస్ స్టేషన్​లో యువతి ఫిర్యాదు చేసింది. దాంతో కిరణ్ కుమార్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు చేపడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఘటనల నేపథ్యంలో నిరుద్యోగులు కాస్త ఇలాంటి విషయాలపై అలెర్ట్ గా ఉంటె మంచిది.

Budget 2024 : రిటైల్ ఇన్వెస్టర్లకు లక్షల కోట్ల షేర్లు.. బడ్జెట్‌కు ముందు సర్వేలో వెల్లడి