NTV Telugu Site icon

Sania Mirza Marriage: టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి.. స్పందించిన సానియా మీర్జా తండ్రి!

Sania Mirza Marriage

Sania Mirza Marriage

Imran Mirza breaks silence on Sania Mirza Wedding: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు సానియా డివోర్స్ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే పాక్ నటి సనా జావేద్‌ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సానియా తన సొంతగడ్డ హైదరాబాద్‌కు మకాం మార్చారు. అయితే మాలిక్‌తో వివాహబంధానికి ముగింపు పలికిన సానియా.. మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు కొంతకాలంగా నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా క్రికెటర్‌ మహమ్మద్‌ షమీని సానియా పెళ్లాడనున్నారని ఆ వార్తల సారాంశం.

సానియా మీర్జా పెళ్లి వార్తలపై తాజాగా ఆమె తండ్రి ఇమ్రాన్‌ మీర్జా స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియాలో వచ్చేవన్నీ చెత్త వార్తలు. సానియా మీర్జా కనీసం అతడిని (మహమ్మద్‌ షమీ) కలవనే లేదు. ఇలాంటి వార్తలు ఎందుకు సృష్టిస్తారో అర్ధం కావడం లేదు’ అని ఇమ్రాన్‌ మీర్జా పేర్కొన్నారు. ఇమ్రాన్‌ మీర్జా వ్యాఖ్యలతో నెట్టింట వచ్చిన ఊహాగానాలకు చెక్ పడింది.

Also Read: Shruti Haasan: ఈ వివక్షలే వద్దు.. నెటిజన్‌పై శ్రుతి హాసన్‌ అసహనం!

షోయబ్‌ మాలిక్‌ను సానియా మీర్జా 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇజాన్ అనే కుమారుడు ఉన్నాడు. కరోనా సమయంలో సానియా-మాలిక్‌ మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరు విడిపోతున్నారని జోరుగా ప్రచారం జరిగినా.. అధికారికంగా వారు ప్రకటించలేదు. ఈ ఏడాది జనవరిలో షోయబ్‌ పాక్ నటిని వివాహం చేసుకోవడంతో.. వీరిద్దరూ విడిపోయినట్లు స్పష్టమైంది. సానియా-మాలిక్‌ విడాకులు తీసుకున్నట్లు సానియా కుటుంబం ప్రకటించింది. మరోవైపు షమీ 2014లో హసీన్‌ జహాన్‌ను వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లుగా వీరి మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో.. ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసుపై కోర్టులో ఉంది.

Show comments