IDBI Recruitment: ఐడీబీఐ లో భారీగా ఉద్యోగాలు..600 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ లో ఉద్యోగాలు చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 600 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు..జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభించింది. మొత్తం 600 పోస్టులకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు idbibank.in అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు..
అర్హతలు..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 20 నుంచి గరిష్టంగా 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు లేదా దానికి సమానమైన అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు..
ఎంపిక ప్రక్రియ..
ఎంపిక ప్రక్రియలో ముందు ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్ట్ చేస్తారు. మొత్తం 600 పోస్టుల్లో 243 జనరల్ కేటగిరీకి కేటాయించారు. మిగిలిన 162 ఓబీసీ, 90 ఎస్సీ, 45 ఎస్టీ, 60 ఈడబ్ల్యూఎస్ విభాగాలకు కేటాయించారు..
జీతం..
మొదటి ఆరు నెలల ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. తర్వాతి రెండు నెలల ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులు నెలకు రూ.15,000 అందుకుంటారు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ idbibank.in ఓపెన్ చేసి.. హోమ్‌పేజీలో ‘కెరీర్’ ట్యాబ్ క్లిక్ చేయాలి.
ఇప్పుడు కొత్త పేజీలో కనిపించే ‘రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ త్రూ అడ్మిషన్ టు IDBI Bank PGDBF – 2023-24.’ లింక్ ఓపెన్ చేయాలి.
తర్వాత అభ్యర్థులు రిజిస్టర్ చేసుకొని, అప్లికేషన్ ఫారమ్ యాక్సెస్ చేయాలి.
ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలు నింపాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1,000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PWD అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి… అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!