NTV Telugu Site icon

ICC Stop Clock: ఐసీసీ కీలక నిర్ణయం.. ఆలస్యం అయితే 5 పరుగుల పెనాల్టీ!

Icc

Icc

ICC introduces stop clock to reduce time between overs in men’s cricket: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో వేగాన్ని పెంచేందుకు ప్రయోగాత్మకంగా ‘స్టాప్‌ క్లాక్‌’ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఓవర్‌ పూర్తయిన 60 సెకన్లలో లోపు తర్వాతి ఓవర్‌ను ఆరంభించడంలో ఫీల్డింగ్‌ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో మూడోసారి విఫలమైతే.. ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. ఈ స్టాప్‌ క్లాక్‌ పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో మాత్రమే అమలు చేయబడుతుంది. 6 నెలల పాటు ప్రయోగాత్మకంగా ఈ స్టాప్‌ క్లాక్‌ను ఉపయోగించాలని ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు.

‘పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా స్టాప్‌ క్లాక్‌ను ఉపయోగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆరు నెలల పాటు ట్రయల్ ప్రాతిపదికన ఇది పరీక్షించబడుతుంది. ఓవర్ల మధ్య సమయం వృథా కాకుండా చూడాలన్నదే మా ఉద్దేశం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య డిసెంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో స్టాప్‌ క్లాక్‌ను మొదటిసారి ఉపయోగించనున్నారు.

Also Read: IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌.. వైజాగ్‌లో కట్టుదట్టమైన బందోబస్తు!

పిచ్‌ను నిషేధించే నిబంధనల్లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. అయిదేళ్ల కాలంలో ఒక పిచ్‌ 5 డిమెరిట్ (అయోగ్యతా పాయింట్లు) పాయింట్స్ పొందితే నిషేధానికి గురయ్యేది. ఇప్పుడు ఆ పాయింట్లను ఆరుకు పెంచినట్లు ఐసీసీ తెలిపింది. ఇక స్టాప్ క్లాక్‌ క్రికెట్‌లో మాత్రమే కాదు టెన్నిస్‌లో కూడా ఉంది. టెన్నిస్‌లో ‘షాట్ క్లాక్’ ఉంటుంది. టెన్నిస్‌లో ఒక ప్లేయర్ పాయింట్ల మధ్య సర్వ్ చేయడానికి 25 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు.