NTV Telugu Site icon

Kajal Aggarwal : ‘సత్యభామ’ లో ఆ సీన్స్ కోసం ఎంతో కష్టపడ్డా..

Satyabhama

Satyabhama

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో స్టార్ హీరోల అందరి సరస న నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ తెలుగులో తన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది.పెళ్లి తరువాత హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కాజల్ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో మంచి విజయం అందుకుంది.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో బాలయ్య హీరోగా నటించారు.ఇదిలా ఉంటే ఈ భామ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ.

Read Also :SSMB29: మహేష్, రాజమౌళి మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ సినిమాను సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను అవురమ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క ,శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు.క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన్న ఈ సినిమా జూన్ 7 గ్రాండ్ గా రిలీజ్ అయింది.తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో కాజల్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొనింది.గతంలో విజయ్ దళపతి ‘జిల్లా’ సినిమాలో పోలీస్ గా నటించిన అది సీరియస్ పాత్ర కాదు.సత్యభామ లో మాత్రం ఎమోషన్ ,యాక్షన్ ఉన్న ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాను అని కాజల్ తెలిపింది.ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎంతగానో కాస్తపడ్డాను.ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ,యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి.ఈ సినిమా ప్రేక్షకులకి ఎంతగానో నచ్చుతుందని ఆశిస్తున్నా అని కాజల్ తెలిపింది.

Show comments