Site icon NTV Telugu

Nilakanta : తెలుగు ఆడియెన్స్ నాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను : మాస్టర్ మహేంద్రన్

Nilakanta (2)

Nilakanta (2)

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా “నీలకంఠ”. ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. “నీలకంఠ” సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. యంగ్ హీరోలు ఆది సాయికుమార్, ఆకాష్ జగన్నాథ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ – తెలుగు ఆడియెన్స్ నాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. ఆది నాకు మంచి ఫ్రెండ్. శంబాల హిట్ తో సాయికుమార్ గారు గర్వపడేలా విజయాన్ని అందుకున్నారు. ఆకాష్ ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. నాకు సినిమానే ప్రపంచం. చాలా పోటీ ఉంది, కొత్త హీరోలు వస్తున్నారు అని నాతో సన్నిహితులు చెబుతుంటారు. కానీ నేను నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలి అనేది ఒక్కటే నాకు తెలిసింది. నీలకంఠ సినిమాకు మా టీమ్ అంతా కష్టపడ్డారు. ప్రొడ్యూసర్స్ ఇద్దరు ప్యాషనేట్. వాళ్లు సెట్ లేకుండా ఒక్క రోజు కూడా షూటింగ్ జరగలేదు. డైరెక్టర్ కొత్త అయినా టాలెంటెడ్. అతను ఇచ్చిన నెరేషన్ తోనే ఎంత టాలెంటెడ్ అనేది తెలిసింది. యష్న సీతగా ఆకట్టుకుంటుంది. జనవరి 2న థియేటర్స్ లోకి వస్తున్న మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

Also Read : Anaganaga Oka Raju : గ్రాండ్ గా ‘అనగనగా ఒక రాజు’తో ప్రీ రిలీజ్ ఈవెంట్..

Exit mobile version