Site icon NTV Telugu

Hyderabad Police: జాగ్రత్త! న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు..

Telangana Police

Telangana Police

Hyderabad Police: న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు… డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు జరిగే వేడుకలపై ఆంక్షలు విధించారు.. వేడుకల కోసం 3 స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్‌లు ముందుగానే అనుమతి తీసుకోవలని పోలీసులు తెలిపారు. వేడుకల నిర్వహణలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి అని వెల్లడించారు.. పోలీసులు ప్రకటన ప్రకారం.. రాత్రి 10 గంటల తర్వాత అవుట్‌డోర్ సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదు.. ఇండోర్ కార్యక్రమాలు మాత్రమే రాత్రి 1 గంట వరకు నిర్వహించవచ్చు… మైనర్లకు ప్రవేశం నిషేధము.. డ్రగ్స్‌, అశ్లీల కార్యక్రమాలు, ఫైర్‌వర్క్స్‌కు పూర్తిగా నిషేధం విధిస్తున్నారు.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు.. న్యూ ఇయర్ వేడుకలు సురక్షితంగా, క్రమబద్ధంగా జరగాలి.. నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకారించాలని పేర్కొన్నారు.

READ MORE: Maruti Suzuki Upcoming Cars 2026: గుడ్‌న్యూస్.. 2026లో మారుతి సుజుకీ నుంచి నాలుగు కార్లు విడుదల..

Exit mobile version