Site icon NTV Telugu

Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్‌.. ఛార్జీలు పెంపు..

Metro

Metro

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను పెంచే అవకాశాలపై తాజాగా సంకేతాలు వెలువడ్డాయి. మెట్రో వర్గాల సమాచారం ప్రకారం, మే రెండో వారంలో సవరించిన టికెట్ రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌ ఛైర్మన్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన భారత్‌కు చేరిన తర్వాతే ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ టారిఫ్ సవరణలతో వార్షికంగా అదనంగా రూ.150 కోట్ల వరకు ఆదాయం పొందాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఛార్జీలు పెంచే అంశంపై ఇప్పటికే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా సమాచారం ఇచ్చింది.

Off The Record: ఆయన కండువా మార్చేశారా?.. ప్రభుత్వంపై మాటలు కూడా మార్చేస్తున్నారా!

ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠ టికెట్ ఛార్జీ రూ.10 కాగా, గరిష్ఠ ఛార్జీ రూ.60గా ఉంది. ఈ గరిష్ఠ ధరను రూ.75 వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం, మెట్రో రైలు సేవలతో పాటు ప్రకటనలు, షాపింగ్ మాల్స్ అద్దె లాంటి ఇతర మార్గాల ద్వారా ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ ఏటా సుమారు రూ.1500 కోట్ల ఆదాయాన్ని నమోదు చేస్తోంది. అయితే మెట్రో నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, బ్యాంకు రుణాల వడ్డీలు వంటి ఖర్చులతో కలిపి సంస్థకు వార్షికంగా సుమారు రూ.2000 కోట్ల వ్యయం జరుగుతోందని వర్గాలు తెలిపాయి.

Supreme Court: సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు

Exit mobile version