Site icon NTV Telugu

Saudi Bus Accident: సౌదీ రోడ్డు ప్రమాదంలో 16 మంది హైదరాబాదీలు సజీవదహనం.. పేర్లు ఇవే..

Soudi

Soudi

Saudi Bus Accident: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో హైదరాబాద్‌ మల్లేపల్లిలోని ఉమ్రా ట్రావెల్స్‌కు సంబంధించిన 16 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం..ఈ పదహారు మంది హైదరాబాద్‌ మల్లేపల్లి బజార్‌ ఘాట్‌కు చెందిన వారిగా తెలిసింది. మృతులను రహీమున్నీసా, రహమత్‌ బీ, షెహనాజ్‌ బేగం, గౌసియా బేగం, కదీర్‌ మహ్మద్, మహ్మద్‌ మౌలానా, షోయబ్‌ మహ్మద్, సోహైల్‌ మహ్మద్, మస్తాన్‌ మహ్మద్, పర్వీన్‌ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్‌ బేగం, జహీన్‌ బేగం, మహ్మద్‌ మంజూరు, మహ్మద్‌ అలీగా గుర్తించారు.

READ MORE: 8000mAh బ్యాటరీ, 165Hz స్క్రీన్‌తో గేమర్స్ కోసం సరికొత్త ప్రమాణాలతో రాబోతున్న OnePlus Ace 6T..!

మరోవైపు.. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈ మృతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సంప్రదింపులు జరిపారు. సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్లోను ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో +91 79979 59754, +91 99129 19545 నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.

Exit mobile version