Hyderabad Cybercrime: హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ శాఖ ప్రజలను క్రెడిట్ కార్డ్ మోసాల పెరుగుతున్న ప్రమాదం గురించి హెచ్చరిస్తోంది. మోసగాళ్లు ఫిషింగ్, నకిలీ మర్చెంట్ వెబ్‌సైట్లు, UPI/QR కోడ్ స్కాములు, రివార్డ్ పాయింట్ స్కాములు, క్రెడిట్ లిమిట్ ఎన్‌హాన్స్‌మెంట్ ఆఫర్లు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, మొబైల్ యాప్ మాల్వేర్ ద్వారా బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
మోసగాళ్ల పని తీరులు:
ఫిషింగ్ లింకులు / నకిలీ వెబ్పేజీలు: ఇమెయిల్, SMS లేదా సోషల్ మీడియా ప్రకటనల ద్వారా నకిలీ పేమెంట్ పేజీలకు లింకులు పంపించి, కార్డ్, OTP వివరాలను మోసగాళ్లు సేకరిస్తారు.
నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు: నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా లేదా క్లాసిఫైడ్ సైట్లలో ఫేక్ హెల్ప్లైన్ నంబర్లు ప్రచురిస్తారు. వీటికి కాల్ చేసినవారు నేరుగా మోసగాళ్లను కలుస్తారు.
క్రెడిట్ లిమిట్ పెంపు మోసాలు: బ్యాంక్ క్రెడిట్ కార్డ్ విభాగం నుంచి ఫోన్ చేస్తున్నట్టు మోసగాళ్లు కాల్ చేసి, లిమిట్ పెంచుతామని చెప్పి, కార్డ్ డిటైల్స్, OTP అడుగుతారు లేదా రిమోట్ యాక్సెస్ యాప్ డౌన్లోడ్ చేయమంటారు.
మాల్వేర్ యాప్లు / APKs: అనధికారిక లేదా మార్చబడిన యాప్లు అనవసరమైన అనుమతులు అడిగి, కార్డ్/OTP సమాచారాన్ని చోరీ చేస్తాయి.
విషింగ్ / కాల్ సెంటర్ మోసాలు: బ్యాంక్ లేదా మర్చెంట్ ఉద్యోగులుగా తేల్చుకొని, కార్డ్ వివరాలు, OTP, CVV అడుగుతారు. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు ఇవ్వడం లేదా యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పడం జరుగుతుంది.
కార్డ్ స్కిమ్మింగ్ / క్లోనింగ్: ఎటిఎంలు లేదా POS పాయింట్లలో కార్డ్ సమాచారం కాపీ చేసి మోసపూరిత లావాదేవీలకు వాడతారు.
వార్డ్ / క్యాష్బ్యాక్ స్కాములు: రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్బ్యాక్ ఇస్తామంటూ, కార్డ్ వివరాలు లేదా OTP తీసుకుంటారు.
SIM స్వాప్ మోసాలు: బాధితుడి మొబైల్ నంబర్ను అధీనంలోకి తీసుకొని, OTPలను తమకు అందేలా చేసి అకౌంట్ను హ్యాక్ చేస్తారు.
ప్రజలకు సూచనలు:
కార్డ్ మోసమైతే వెంటనే బ్యాంక్ను సంప్రదించి కార్డ్ను బ్లాక్ చేయండి. వెబ్సైట్లో గానీ, సోషల్ మీడియాలో గానీ కనిపించే నకిలీ నంబర్లకు కాల్ చేయకండి. మీ కార్డ్ వెనుక ఉన్న అధికారిక నంబర్ లేదా బ్యాంకు అధికారిక యాప్ / వెబ్సైట్ ఉపయోగించండి. OTP, PIN, CVV, ఫుల్ కార్డ్ నంబర్ లాంటి వివరాలు ఎవరితోనూ ఫోన్, ఇమెయిల్, మెసేజ్ లేదా సోషల్ మీడియాలో పంచుకోవద్దు. బ్యాంకులు వీటిని అడగవు. రీఫండ్ లేదా ట్రాన్సాక్షన్ ఫిక్స్ చేసేందుకు యాప్ డౌన్లోడ్ చేయమని ఎవరు కాల్ చేస్తే వెంటనే కాల్ కట్ చేయండి. లింకులు క్లిక్ చేయవద్దు. బ్యాంకింగ్, UPI, ఇమెయిల్ పాస్వర్డ్లు మార్చండి. మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) ప్రారంభించండి. SIM స్వాప్ అనుమానం ఉంటే, వెంటనే మీ మొబైల్ ఆపరేటర్ను సంప్రదించి SIM బ్లాక్ చేయించండి. మీ అకౌంట్ స్టేట్మెంట్స్ను తరచూ చెక్ చేయండి. అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే డిస్ప్యూట్ రైజ్ చేయండి. మోసాలకు గురైనట్లయితే తక్షణమే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కు కాల్ చేయండి.. లేదా cybercrime.gov.in వెబ్సైట్లో కంప్లయింట్ పెట్టండి..
