Hunt: సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ ‘హంట్’ పేరుతో ఓ సినిమా తీస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఆ టైటిల్ తమదని అంటున్నారు హీరో కమ్ డైరెక్టర్ నిక్షిత్. శ్రీ క్రియేషన్స్ పతాకం పై తనే హీరోగా, దర్శకుడిగా నర్సింగ్ రావు నిర్మించిన చిత్రానికి ‘హంట్ (Hunt)’ అనే టైటిల్ పెట్టినట్లు తెలుపుతూ మోషన్ టీజర్‌ను విడుదల చేశారు.
Drishyam 2: ఆకట్టుకుంటున్న హిందీ ‘దృశ్యం-2’ ట్రైలర్
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ ‘మా సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ టైటిల్ ను 6 నెలల క్రితం ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశాము. అదే టైటిల్ తో భవ్య క్రియేషన్స్ వారు సుధీర్ బాబుతో సినిమా చేస్తున్నారు. మేము ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకు వెళ్ళాం. అధికారికంగా మేము రిజిస్టర్ చేసుకున్న తర్వాత వేరే వారు ఎలా ఆ టైటిల్ వాడతారు అని ప్రశ్నిస్తున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం’ అని అన్నారు.
