NTV Telugu Site icon

NTR : ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్..?

Ntr

Ntr

NTR :మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను అక్టోబర్ 10 న దసరా కానుక విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also :Allu Aravind : రామోజీరావును చివరి చూపు చూసుకోలేక పోతున్నా..

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ను అందించారు.ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 130 భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమాను ప్రశాంత్ నీల్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరెక్కిస్తున్నట్లు సమాచారం.మేకర్స్ త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఇతర వివరాలు తెలియజేయనున్నట్లు సమాచారం.

Show comments