Site icon NTV Telugu

Hrithik Roshan : ఫిట్ నెస్ కోసం హృతిక్ చేసే ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Whatsapp Image 2023 09 01 At 6.32.47 Pm

Whatsapp Image 2023 09 01 At 6.32.47 Pm

హృతిక్ రోషన్.. ఈ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తనదైన నటనతో బాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్లకు పైనే ఉంటుంది.కానీ అంతా ఏజ్డ్ లా అయితే కనిపించడు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీగా బాడీ బిల్డ్ చేస్తూ ఎంతగానో అలరిస్తున్నాడు హృతిక్..తన సిక్స్ ప్యాక్ బాడీతో అద్భుతమైన యాక్షన్ స్టంట్స్ తో అలాగే అదిరిపోయే స్టెప్పులతో ఈ వయసులో కూడా అభిమానులతో విజిల్స్ వేయిస్తున్నాడు హృతిక్. ఈ స్టార్ హీరో తన ఒక్కో సినిమాకు 60 నుంచి 70 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అయితే తన ఫిట్నెస్ కోసం కూడా హృతిక్ కోట్లల్లో డబ్బు ఖర్చు చేస్తున్నాడట.. అందుకే ఇద్దరు పిల్లలకు తండ్రి అయినప్పటికీ కూడా ఇంకా తన బాడీని మంచి షేప్ ఉంచడానికి ఎంతో కష్టపడుతున్నాడు.ప్రతి రోజు జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేస్తాడు.

తనను ట్రైన్ చెయ్యడం కోసం ఒక పర్సనల్ ట్రైనర్ ని కూడా అపాయింట్ చేసుకున్నాడు హృతిక్.ఆ ట్రైనర్ పేరు క్రిస్ గెతిన్. ఈయన యూకే కి చెందిన వాడని సమాచారం.హృతిక్ ఈయనకు ప్రతి ఏడాదికి రెండున్నర కోట్లకు పైగానే చెల్లిస్తున్నట్లు సమాచారం.. ఈ విషయం తెలిసిన అభిమానులు రెండున్నర కోట్లతో ఒక సినిమానే తీసేయొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు ఫిట్నెస్ కోసం ఇంత డబ్బు ఖర్చుపెట్టే వ్యక్తి ఈ దేశంలో హృతిక్ ఉన్నాడేమో.. హృతిక్ ప్రస్తుతం ఫైటర్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఆ తరువాత  జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 చిత్రం లో నటించబోతున్నాడు.. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో మొదలు కానుందని సమాచారం.. తాజాగా ఈ సినిమా 2025 జనవరి 25 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రాబోతోందని మేకర్స్ అనౌన్స్ కూడా చేసారు.

Exit mobile version