బాలీవుడ్ రొమాంటిక్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. వరుస సినిమాలను చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు.. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.. అమ్మాయిలకు హృతిక్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ ఫిట్ గా ఉండాలని హృతిక్ తెగ కష్ట పడతాడు.. ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి సిక్స్ ప్యాక్ కనిపించకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఆయన ఫిట్ నెస్ ను కోల్పోయాడు.
అంతేకాదు కాస్త బొద్దుగా మారిపోయాడు. కానీ ఇప్పుడు తిరిగి తన సిక్స్ ప్యాక్ లుక్ లోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అది కూడా కేవలం ఐదు వారాల్లోనే సిక్స్ ఫ్యాక్ ను తిరిగి పొందడం అంటే అంత ఈజీ కాదు.. ప్రస్తుతం హృతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. హృతిక్ రోషన్ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా లు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇతని డ్యాన్స్ కు ఫిదా అవ్వని వాళ్లు ఉండరు.. అమ్మాయిలు అయితే హృతిక్ అంటే పడి చచ్చిపోతారు..
ఆగస్టు నెలలో హృతిక్ సిక్స్ ప్యాక్ మాయమైంది. అయితే అక్టోబర్ 7 నాటికి మళ్లీ సిక్స్ ప్యాక్ చేశాడు. ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టకపోవడంతో ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు.. మళ్లీ ఫిట్ అవ్వడానికి అతనికి కేవలం ఐదు వారాలు పట్టిందని కూడా పోస్ట్ లో పేర్కొన్నాడు.. ఇలానే ఉండటానికి ట్రై చేస్తానని పేర్కొన్నాడు.. మొత్తానికి అతని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ప్రస్తుతం వరుస సినిమాల పై ఫోకస్ పెట్టాడు..
