NTV Telugu Site icon

WhatsApp Location Trace: వాట్సాప్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే

Whatsapp

Whatsapp

WhatsApp Location Trace: ప్రస్తుత రోజుల్లో ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏదైనా ఉంది అంటే అది వాట్సాప్. వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొని వస్తూ మరింత సౌకర్యవంతంగా తీర్చబడుతుంది. అయితే, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో భాగంగా వాట్సప్ ద్వారా కూడా మన లొకేషన్ ను ట్రేస్ చేయవచ్చని మీకు ఎవరికైనా తెలుసా..? ఏంటి.. వాట్సాప్ ద్వారా లొకేషన్ కూడా ట్రేస్ చేయవచ్చా అని అనుకుంటున్నారా..? అవునండి బాబు.. వాట్సప్ కాల్స్ ద్వారా కూడా మీ లొకేషన్ ని ట్రాక్ చేయవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అసలు ఇది ఎలా సాధ్యమంటే..

Also Read: South Korea : ప్రజల నిరసన, రెడీగా పోలీసులు.. దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ కు రంగం సిద్ధం

వాట్సప్ కాలింగ్ సమయంలో మీ ఐపీ అడ్రస్ ను ట్రాక్ చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వాట్సప్ సరికొత్త అప్డేట్ ను తీసుకొని వచ్చింది. మీ లొకేషన్ లో ఎవరు ట్రేస్ చేయకుండా ఉండేందుకు వాట్సాప్ ఓ కొత్త సెట్టింగ్ ను తీసుకువచ్చింది. వాట్సప్ కాల్ సమయంలో ఎవరైనా హ్యాకర్ లేదా స్కానర్ మీ లొకేషన్ తెలుసుకోకుండా ఉండేందుకు ఈ సెక్యూరిటీ ఫీచర్ ఆన్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలంటే..

Also Read: Madhavilatha: మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు

వాట్సాప్ లో ఈ సెక్యూరిటీ ఫీచర్‌ను ఆన్ చేయడం చాలా అవసరం. దాంతో మీరు కాల్ చేస్తున్నప్పుడు సురక్షితంగా ఉండగలుగుతారు. అయితే, ఈ ఫీచర్‌ను సెట్టింగ్స్‌లో ఎక్కడ అనేది ప్రశ్న. ఇక దీన్ని ఆన్ చేయడానికి మీరు మీ ఫోన్‌లో వాట్సాప్ ను ఓపెన్ చేయాలి. ఆపై కుడివైపు పైన ఉన్న 3 డాట్స్‌ను క్లిక్ చేయండి. 3 డాట్స్ పై క్లిక్ చేసిన తర్వాత, “Settings” ఎంపికపై క్లిక్ చేయండి. “Settings” ఓపెన్ అయిన తర్వాత, “Privacy” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. “Privacy” ఆప్షన్‌లో, మీరు “Advanced” ఆప్షన్‌లో ఈ ఫీచర్‌ను కనుగొనగలరు. అక్కడ Protect IP Address In Calls ముందు ఒక బటన్ ఉంటుంది. దానిని నొక్కి ఈ ఫీచర్‌ను మీ వాట్సాప్ అకౌంట్‌లో ఆన్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత, మీ అన్ని కాల్స్ వాట్సాప్ సర్వర్ ద్వారా జరిగిపోతాయి. తద్వారా మీరు ఎప్పుడూ స్కామర్ల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. ఈ ఫీచర్‌ను మీరు ఆన్ చేసుకుంటే, ఇకపై మీరు WhatsApp కాల్స్ చేస్తూ ఉన్నప్పుడు మీ లొకేషన్‌ను ఎవరూ ట్రాక్ చేయలేరు. ఇది మీ వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు ఎంతో సహాయపడుతుంది.