NTV Telugu Site icon

Viral Video: అసలు ఎలా వస్తయో ఇలాంటి ఐడియాలు.. మీరూ ట్రై చేస్తే పోలా..

Chapathi Making

Chapathi Making

Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పుడు నుంచి ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన.. ఆ విషయం ఇట్లే అందరికీ తెలిసిపోతుంది. కేవలం వార్తలు మాత్రమే కాకుండా మనకు పనికి వచ్చే అనేక విషయాలు, అలాగే పనికిరాని వీడియోలు కూడా చాలానే కనపడుతుంటాయి. ఇకపోతే సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి చిత్ర విచిత్ర పనులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది. ఈ ప్రయత్నంలో ఒక్కోసారి ప్రాణాల మీది తెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు. మరికొందరైతే.. ఫేమస్ కావడానికి చేసే ప్రయత్నంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.

Panipuri: ఇందుకే కాబోలు.. అమ్మాయిలు పానీపూరి లొట్టలేసుకుంటూ తినేస్తారు..

సోషల్ మీడియా ద్వారా చాలామంది అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ విషయం జరిగినా.. తెలుసుకోవడం మాత్రమే కాకుండా మన చుట్టూ మనకు తెలియకుండా ఉండే అనేక విషయాలను కూడా ఇంట్లో ఉండే తెలుసుకుంటున్నాము. ఉదాహరణకు మనం నివసిస్తున్న ప్రాంతం దగ్గరలో మనకు తెలియని ఏదైనా ప్రాంతం కానీ., ఆహార పదార్థాలకు సంబంధించిన కొత్త రకం వంటలు ఇలా అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియోలో చపాతీలను సులువుగా చేసే పద్ధతిని ఓ మహిళ చేసి చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే..

Junnu: అయ్యా బాబోయ్.. ‘జున్ను’ తింటే జరిగేది ఇదా..

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో ఓ మహిళ చపాతీలను తయారు చేసేందుకు ముందుగా చపాతీ పిండి కలిపిన ముద్దను తీసుకుని వాటిని చిన్నచిన్న ఉండలుగా తీసుకొని గోధుమపిండిలో వేసింది. ఆ తర్వాత గోధుమపిండి ఉండలను ఒకదానిమీద ఒకటి ఓ ప్లాస్టిక్ కవర్ ను అడ్డుపెట్టి మొత్తంగా ఐదు చపాతీలకు పైగా ముద్దులను పేర్చి చివరగా ఓ పెన్నం లాంటిది తీసుకొని ఆ పిండి ముద్దలపై ఒక్కసారిగా ఒత్తింది. ఇంకేముంది దాంతో ఒకటేసారి అన్ని గోధుమపిండి ముద్దలు చపాతి తయారు చేసుకునేందుకు రెడీగా తయారయ్యాయి. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఇన్నాళ్లు మీరు ఎక్కడున్నారండి.. ఈ చిట్కా తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments