NTV Telugu Site icon

Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ ఇంకా ఎన్ని రోజులు పడుతుందంటే..?

Pushpa 2

Pushpa 2

Pushpa 2 :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,టీజర్,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు .

Read Also :Anchor Suma : అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగోడుతున్న సుమ..

ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడనుందని న్యూస్ తెగ వైరల్ అవుతుంది.దీనికి సంబంధించి మేకర్స్ ఇంకా స్పందించలేదు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.పుష్ప 2 షూటింగ్ ఇంకా 50 రోజులపైనే జరగనుందని తెలుస్తుంది.అలాగే వాటికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వుంది.సుకుమార్ అండ్ టీమ్ ప్రస్తుతానికి ఈ సినిమా కోసం మూడు యూనిట్లు గా వర్క్ చేస్తున్నారు. రెండు యూనిట్లు రామోజీ ఫిలిం సిటీలో మరో యూనిట్ మారేడుమిల్లి లో వర్క్ చేస్తున్నారు..అయితే ఈ సినిమా చెప్పిన తేదీనే రిలీజ్ కావాలని మూవీ టీం గట్టిగా ప్రయత్నిస్తున్నారట. కానీ ఆ డేట్ కి సినిమా రెడీ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది.ఒకవేళ ఈ సినిమా వాయిదా పడితే డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.