NTV Telugu Site icon

Houthi Rebels: అమెరికా హెచ్చరికలను పట్టించుకోని హౌతీ రెబెల్స్.. వాణిజ్య నౌకలపై మరోసారి దాడి

Hotuhi

Hotuhi

Red Sea: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలని యెమెన్​లోని హౌతీ రెబెల్స్​ను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు దేశాలు హెచ్చరించాయి. ఈ దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, అమెరికా హెచ్చరికలను హౌతీ రెబల్స్ పట్టించుకోలేదు.. మరోసారి వాణిజ్య షిప్స్ పై దాడులకు దిగింది. మానవరహిత ఉపరితల డ్రోన్‌ను ప్రయోగించి ఈ దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయోల్- గాజా యుద్ధం తర్వాత హౌతీలు వాణిజ్య నౌకలపై దాడులు చేయడం పెరిగింది.

Read Also: Isro Chief Somanath: నేడు జేఎన్టీయూ స్నాతకోత్సవం.. ఇస్రో చీఫ్ కు డాక్టరేట్ ప్రదానం

కాగా, హౌతీ రెబల్స్ మరోసారి వాణిజ్య నౌకలపై దాడి చేశాయని అమెరియా నావల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ మాట్లాడుతూ.. పేలుడుకు ముందు మానవరహిత ఉపరితల నౌక (యుఎస్‌వి) యెమెన్ నుంచి అంతర్జాతీయ షిప్పింగ్ లైన్‌లలోకి వస్తుండగా దానిపై డ్రోన్లతో ఎటాక్ చేసిందని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ, యుఎస్‌వి (USV) ఏ నౌకను లక్ష్యంగా చేసుకుంటుందనే దాని గురించి అతడు స్పష్టంగా చెప్పలేదు.

Read Also: Ram Mandir: రామమందిర ఆహ్వానపత్రిక ప్రత్యేకతలు ఇవే.. 7000 మందికి అతిథులకు ఆహ్వనం..

అయితే, ఎర్ర సముద్రం గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్, మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్​తో సంబంధాలు ఉన్న నౌకలను టార్గెట్ గా చేసుకుని హమాస్​కు మద్దతుగానే హౌతీలు ఈ దాడులకు పాల్పడుతున్నాయి. హౌతీలకు ఇరాన్ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Show comments