హనీ రోజ్.. హనీ రోజ్.. యూత్ ప్రతి ఒక్కరు ఇదే పేరును జపిస్తున్నారు..ఆమె అందం అటువంటిది.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేస్తుంది..వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.. ఈ సినిమాలో నటించింది హనీ రోజ్.. ఇక ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది..
ఇదిలా ఉండగా హనీ పాప గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా కోటిరూపాయల వరకు డిమాండ్ చేస్తుందట ఈ చిన్నది.. ప్రస్తుతం రాచెల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీగా రానుంది. ఇక విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీలో హానీ రోజ్ స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు..
ఈ అమ్మడు వీరసింహారెడ్డి తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల కోసం హనీ రోజ్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ టూ బాటమ్ అందాలతో ఊరించే హనీ రోజ్ సౌత్ లో ఫుల్ బిజీ కానున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.. కెరీర్ పరంగా చూస్తే.. స్టార్ హీరోల సరసన మంచి ఛాన్స్ వస్తేనే చేయాలనే ఆలోచనలో ఉందట హనీరోజ్. మేకర్స్ సైతం సీనియర్ హీరోలను హానీ బెటర్ చాయిస్ అని ఆలోచిస్తున్నారట.. మరి నెక్స్ట్ ఏ హీరోతో నటిస్తుందో చూడాలి.. ప్రస్తుతం అయితే మలయాళంలో సినిమాలు చేస్తోంది హానీ రోజ్. ప్రస్తుతం ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్..
