కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ నుంచి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు.లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్ లు గా నటించారు. జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు.అలాగే జవాన్ సినిమా లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ ముఖ్య పాత్రలు పోషించారు.పక్కా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోం బ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కించారు.సెప్టెంబర్ 7 న గ్రాండ్ గా విడుదల అయినా జవాన్ సినిమా అద్భుతమైన టాక్ దూసుకెళ్తుంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.. ఇటీవలే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది.
జవాన్ సినిమాకు ముందు కేవలం తమిళ్ డైరెక్టర్ గా వున్న అట్లీ.. జవాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు..జవాన్ పలు ప్రాంతాల్లో ఇప్పటికీ విజయవంతంగా స్క్రీనింగ్ అవుతోంది. జవాన్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అట్లీ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసి హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఓ ఇంటర్వ్యూ లో అట్లీ ని తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి అడుగగా.. జవాన్ రూ. 1,100 కోట్లకు పైగా వసూలు చేసిందని.. తన తదుపరి ప్రాజెక్ట్ కనీసం రూ. 3,000 కోట్లు వసూలు చేయాలి. ఇది జరగాలంటే కచ్చితంగా షారుఖ్ ఖాన్, విజయ్ కలిసి నటింపజేయాలి.. అని అట్లీ ఎంతో ధీమాగా చెప్పాడు.తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నాడని ఇటీవలే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి అట్లీ ముందుగా అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా..లేదంటే విజయ్-షారుఖ్ ఖాన్ సినిమా చేస్తాడా. అనేది మాత్రం తెలియాల్సి వుంది.
..
