Marriage Fraud: ఎందన్నా మరీ ఇంత దురదృష్టం ఉంది మీ జీవితంలో. పాపం సర్ ఆ అన్న. ఎందుకంటే ఆయన రెండు సార్లు పెళ్లి చేసుకుంటే ఇద్దరు భార్యలు లేకుండా పోయారు. మొదటి సారి ఏమో మాదకద్రవ్యాల బానిస వధువుగా వస్తే మనోడు భరించలేక వాళ్లింటికి తీసుకెళ్లి దింపేసి వచ్చాడు. సరే మళ్లీ కొత్త జీవితం ప్రారంభిద్దామని మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఈ సారి వచ్చిన భార్య రెండో రోజే ఇల్లు వదిలి వెళ్లిపోయింది. పాపం సర్ ఆ మనిషి.. ఇంతకీ ఆయన కథ ఏంటి, ఎక్కడ జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Minister Jupally: ఈ ప్రభుత్వం ఇవాళో, రేపో కూలిపోతుందన్న కేటీఆర్.. మంత్రి జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా సనాహి పంచాయతీకి చెందిన వ్యక్తి రాకేష్ కుమార్. దరిద్రం దండిగా ఉండటంతో రెండు పెళ్లిలు చేసుకున్నాడు మనోడు. పాపం ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేస్తున్నాడని అనుకుంటే పొరపాటే. విషయం ఏందంటే ఒక్కరూ మనోడితో లేరు. మధ్యవర్తి పెళ్లి పేరుతో తనకు రూ.8 లక్షలు మోసం చేశాడని రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలలో పంజాబ్‌కు చెందిన అమ్మాయిని తాను వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. ఆమె మాదకద్రవ్యాలకు బానిసై ఇంట్లో కూడా మాదకద్రవ్యాలు తీసుకునేదని వాపోయాడు. ఇక ఆమెను భరించలేక తనను వాళ్ల ఇంటి వద్ద వదిలి వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత మధ్యవర్తి అరవింద్ కుమార్ తనకు రెండో పెళ్లి చేయిస్తానని హామీ ఇచ్చి, రూ. 8 లక్షలు కాజేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
మళ్లీ మరో పంజాబ్ అమ్మాయి..
తనకు హోషియార్ పూర్‌కు చెందిన ఒక అమ్మాయితో అరవింద్ కుమార్ రెండవ వివాహం ఏర్పాటు చేశాడని చెప్పారు. ఇక్కడ దారుణం ఏంటంటే ఆమె పెళ్లి జరిగిన రెండవ రోజే ఇంటి నుంచి వెళ్లిపోయిందని వాపోయాడు. మోసపోయినట్లు గుర్తించిన రాకేష్ కుమార్ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి మధ్యవర్తి అరవింద్ కుమార్‌పై ఫిర్యాదు చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ప్రణాళికా ప్రకారం చేసిన కుట్ర అని, దీనితో తాము ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వాపోయారు. వివాహం పేరుతో రాకేష్ కుమార్ మోసగించబడ్డారని, అందుకే ఆయనకు న్యాయం చేయడానికి తాము హమీర్‌పూర్ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నామని మానవ హక్కుల కమిషన్ జనరల్ సెక్రటరీ పూనమ్ మడియల్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
READ ALSO: Bengaluru: మెట్రోలో పరుగులు పెట్టిన గుండె.. రెండోసారి కూడా సక్సెస్
