NTV Telugu Site icon

Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి హైకోర్టులో ఊరట!

Minister Srinivas Goud

Minister Srinivas Goud

High Court dismissed Pela on Telangana Minister Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నేడు కొట్టివేసింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను మంగళవారం ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది.

శ్రీనివాస్ ​గౌడ్​ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో​ తన​ ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని​ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన తర్వాత.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని రాఘవేంద్ర రాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. అలా చేయడం చట్టవిరుద్ధమని, శ్రీనివాస్ ​గౌడ్ఎ న్నికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న హైకోర్టు.. నేడు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.