టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జాతిరత్నాలు సినిమా నవీన్ కు మంచి హిట్ ను వచ్చింది.. దీనికన్నా ముందు సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా మంచి ఫేమ్ ను అందించింది.. ఆ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంది.. ఇక గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఈ సినిమా నవీన్ కేరీర్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ హీరో ‘అనగనగ ఒక రాజు’ సినిమాలో నటిస్తున్నాడు.. కాగా, తాజాగా హీరో నవీన్ పోలిశెట్టికి రోడ్డు ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
ఈయన ప్రస్తుతం అమెరికాలో ట్రిప్ కి వెళ్లినట్లు తెలుస్తుంది.. అక్కడ బైక్ కు యాక్సిడెంట్ అయ్యినట్లు టాక్.. ఈ ప్రమాదంలో ఆయన చేతికి ఫ్యాక్చర్ అయినట్లు తెలుస్తుంది.. డాక్టర్లు రెండు నెలలు పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దాంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడని సమాచారం.. అసలు అమెరికాలో రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది.. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు..
సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అనగనగా ఒక రాజు’ సినిమా చేస్తున్నాడు.. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.. ఈ మూవీ షూటింగ్ మొదలైందా లేదా అనేది కూడా తెలియలేదు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా అప్డేట్ రాబోతుందని సమాచారం…