మేడారం మహాజాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభంకాబోతోంది. ఇప్పటికే వేలాదిమంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మలకు ముక్కులు చెల్లించుకుంటున్నారు. మొక్కితె వరమిచ్చే వనదేవతలకు భక్తులు బంగారం సమర్పిస్తూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా ములుగు జిల్లా మేడారంలో హెలికాప్టర్ రైడ్స్ షురువయ్యాయి. తాడ్వాయి మండలం ఎలుబాక నుండి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు హెలికాప్టర్ సేవలు నడపనున్న టూరిజం శాఖ తాజాగా తెలిపింది.
Also Read:Moon: చంద్రునిపై హోటల్!.. బుకింగ్స్ ప్రారంభం.. ధర తెలిస్తే షాకవుతారు
మేడారం వచ్చే భక్తులకు ఈరోజు నుంచి హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులోకి రానున్నాయి. పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 6-7 నిమిషాల జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్ కు ఒక్కొక్కరికి రూ.4,800 ఛార్జీగా నిర్ణయించారు. హనుమకొండ నుండి మేడారం అప్ డౌన్ కు రూ.35,999 ఛార్జీగా నిర్ణియించారు. ఈనెల 31 వరకు ఉ.8 గంటల నుండి సాయంత్రం 5.20 వరకు అందుబాటులో ఉండనున్నాయి హెలికాప్టర్ రెడ్స్.
