NTV Telugu Site icon

Nagaland: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన మహిళా అభ్యర్థి

Nagaland Hekani

Nagaland Hekani

Nagaland: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హెకాని జఖాలు అనే మహిళా అభ్యర్థి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్న తొలి మహిళా ఎమ్మెల్యేగా నిలవనుంది. దిమాపూర్ నియోజకవర్గం నుంచి హెకాని విజయం సాధించింది. నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్ల తర్వాత ఈరోజు తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందింది. బిజెపి మిత్రపక్షం ఎన్‌డిపిపికి చెందిన హెకానీ జఖాలు దిమాపూర్-3 స్థానం నుంచి గెలుపొందారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 183 మంది అభ్యర్థుల్లో నలుగురు మహిళల్లో 48 ఏళ్ల న్యాయవాది కూడా ఉన్నారు.

Read Also: NBK 108: త్వరలో స్టార్ట్ అవ్వనున్న కొత్త షెడ్యూల్… జాయిన్ అవ్వనున్న కాజల్

పశ్చిమ అంగామి స్థానంలో ఎన్‌డిపిపికి చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌటుయోనువో క్రూసే ముందంజలో ఉన్నారు. అధికార ఎన్‌డిపిపి-బిజెపి కూటమి మూడు స్థానాల్లో విజయం సాధించి 35 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నందున రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయం. ముఖ్యమంత్రి నీఫియు రియో నేతృత్వంలోని నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ 2018లో గత ఎన్నికల నుండి బిజెపితో పొత్తులో ఉంది. గత ఎన్నికలలో కూటమి 30 సీట్లు గెలుచుకోగా, NPF 26 స్థానాలను గెలుచుకుంది.

Read Also: Air Pollution : ముంబైలో ఆస్పత్రుల పాలవుతున్న జనం.. కారణం తెలిసినా ఏం చేయలేని వైనం

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 33 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. రెండు స్థానాల్ని ఇతరులు గెలుచుకున్నారు. ఎన్‌పీఎఫ్ 3 స్థానాల్లో, ఎన్‌సీపీ 4 స్థానాల్లో, ఇతరులు 11 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవడం కష్టమే.