NTV Telugu Site icon

Viral Video: వార్నీ.. నీ తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే బ్రో.. వీడియో చూస్తే నవ్వాగదు..

Funny Video

Funny Video

ఈరోజుల్లో వాహనాలు ఎక్కువగా అయ్యాయి.. బస్సుల్లో వెళ్లేవారి సంఖ్య తగ్గింది.. దాంతో పాదాచారులకు కష్టంగా మారింది.. ఎందుకు అనుకుంటున్నారా.. వాహనాల రద్దీ పెరగడంతో జనాలకు రోడ్లు దాటడం పెద్ద కష్టంగా మారింది.. రోజు రోజుకు మనుషుల కన్నా ఎక్కువగా వాహనాల సంఖ్య పెరిగిపోయింది.. దీంతో మనుషులు రోడ్ల పై నడవక తప్పని సరి అయినా.. అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది.. ఇక ఇలా చాలా మంది పాదాచారులు తమ గమ్యస్థానానికి లెట్ గా చేరుకుంటారు.. అయితే హెవీ ట్రాఫిక్ లో రోడ్డు దాటటానికి వినూత్న ఆలోచన చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ట్రాఫిక్ గంట గంటకు పెరుగుతుంది..రోడ్డు దాటడం చాలా కష్టంగా మారుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వం రోడ్లు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోంది. దీంతో ప్రమాదాలు జరగకుండా ఈ వంతెనలు లేని చోట రోడ్డు దాటాల్సి వస్తోంది. ప్రస్తుతం రోడ్డు దాటడం అంటే ఓ యుద్ధం చేయాల్సి వస్తుంది. రోడ్డు దాటడం అతి కష్టంగా మారింది. రోడ్డు దాటడం అనే సమస్య మీరు కూడా ఎదుర్కొంటుంటే.. ఈ రోజు మీ కోసం ఒక వీడియోను తీసుకువచ్చాము. ఒక బాలుడు తన తెలివి తేటలను ఉపయోగించి చాకచక్యంగా రోడ్డును దాటాడు..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ఫుట్‌పాత్‌పై నిల్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఎలాగైనా రోడ్డు దాటాలని చాలాసార్లు ప్రయత్నించాడు. ఆ రోడ్డు మీద చాలా వాహనాలు వెళుతున్నాయి, అతనికి రోడ్డు దాటడానికి అవకాశం దొరకలేదు. అప్పుడు ఆ యువకుడు తాను రోడ్డు దాటడానికి ఒక గొప్ప టెక్నిక్‌ని కనిపెట్టాడు. అతను నడవలేనట్లుగా మోకాళ్లపై నిలిచి రోడ్డు దాటడం ప్రారంభిస్తాడు.. అతను రావడం చూసి వాహనదారులు అంతా ఆగిపోతారు.. ఆ తర్వాత అతను రోడ్డు దాటుతాడు.. వెంటనేలేచి పరిగెడుతాడు.. అది చూసి అంతా షాక్ అవుతారు.. అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. మీరు ఒక లుక్ వేసుకోండి..