వాయువ్య మరియు మధ్య భారతంలో తీవ్రమైన వడగాలుల నేపథ్యంలో, రాజస్థాన్ మరియు ఇతర రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకుంటున్నాయి. బుధవారం ఢిల్లీలోని 52.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ కంటే ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. వాతావరణ శాఖ అధికారులు, ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
Heatwave Alert in Delhi : ఒకవైపు ఎండలు, మరోవైపు వడగాలులు..( వీడియో )
- ఎండలు
- వడగాలులు