బొప్పాయి పండ్ల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి.. ఎన్నో రోగాలను నయం చేసే గుణం వీటికి ఉంటుంది..మన రెగ్యులర్ గా చూసే బొప్పాయి కాయల వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా.. బొప్పాయి రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు తినే వారికి కూడా చాలా అనారోగ్య సమస్యలకు పరిస్కారం దక్కుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బొప్పాయి వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
లివర్ సమస్యల నుండి బొప్పాయి కాపాడుతుంది. ఆల్కాహాల్ ఎక్కువ తాగడం వల్ల లివర్ చెడిపోవడం లేదా స్మోకింగ్ అధికంగా చేయడం వల్ల లివర్ చెడిపోతుంది.. అలాగే ఊపిరితిత్తులు కూడా చెడిపోతాయి.. లివర్ పూర్తిగా చెడిపోక ముందే క్రమం తప్పకుండా ఒక కప్పు బొప్పాయి ముక్కలను లేదా బొప్పాయి జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా కనీసం రెండున్నర నుండి మూడు నెలలు బొప్పాయి ముక్కలు తినడం వల్ల లివర్ సగం వరకు క్లీన్ అయినట్లే అంటున్నారు. ఇక బొప్పాయి వల్ల మరో అద్బుత ప్రయోజనం ఏంటీ అంటే ఎక్కువగా కిడ్నీల్లో రాళ్లు తొలగి పోతాయి. బొప్పాయిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగి పోవడం లేదా యూరిన్ ద్వారా బయటకు వెళ్లి పోవడం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
అందుకే ప్రతి రోజూ క్రమం తప్పకుండ వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. బొప్పాయిలో ఉండే ఏ, బీ, సీ, ఇ విటమిన్లు మానవ శరీరంకు అత్యంత అవసరం. అందుబాటు రేటు లో ఉండే అత్యంత ప్రభావితమైన ఫలం అంటే ఇదే. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఈ బొప్పాయి తినడం మంచిది. బొప్పాయిలో ఔషధ గుణాలు మరియు విటమిన్లు చాలానే ఉన్నాయి. బొప్పాయి ని ఎక్కువగా రక్త కణాలు పడిపోయిన వారికి తినిపించేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో బొప్పాయి చెట్టు ఆకుల రసం ను తాగిస్తారు.. రక్త కణాలు పెరుగుతాయి.. చర్మ సౌందర్యానికి కూడా దీన్ని వాడుతారు.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ బొప్పాయిని తినడం అలవాటు చేసుకోండి..
