చిన్న పిల్లల నుండి పెద్దలందరు మామిడిపండ్లను ఎంతో ప్రియాతి ప్రియంగా తింటారు. ఇక ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఇక మామిడి పండ్లతో జ్యూసులు, లస్సీలు అంటూ అనేక రకరకాలుగా చేసుకుని ఆరగిస్తారు. ఇందులో భాగంగానే మీరు కూడా ఓ సారి తియ్యటి మామిడి పండ్లతో బొబ్బట్లు చేసి చూడండి. ఒక్కసారి రుచి చూస్తే చళ్ళు.. వాటిని అంత ఈజీగా తినడం ఆపరు. మన ఇంటికి ఎవరైనా అతిధిలు వచ్చిన సమయంలో ఇవి చేసినా కూడా సూపర్ అంటారు. ఇక వీటిని చేయడం కూడా చాలా సులువు. మరి ఇందుకు కావాల్సిన పదార్థాలు, వీటి తయారీ విధానం చూద్దామా..
SRH vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్..
ముందుగా మామిడి బొబ్బట్లకు కావాల్సిన పదార్థాల లిస్ట్ విషయానికి వస్తే.. మామిడి పండ్లు ( ఎంతమందికి కావాలో అంత సరిపడా), 1 కప్పు గోధుమ పిండి / మైదా, తగినంత నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, పావు కప్పు బెల్లం తురుము, 1 టీస్పూన్ యాలకుల పొడిలను రెడీ చేసుకోవాలి. ఇకతయారీ విధానం గురించి చూస్తే..
ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండి/ మైదా పిండి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని గోరు వెచ్చని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి కొద్దిసేపు వరకు పక్కకి పెట్టుకోవాలి. ఇక మామిడి పండును దాని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఓ రెండు చెంచాల నెయ్యిలో పచ్చికొబ్బరి తురుము వేసుకోని.. చిన్న మంట మీద రంగు మారే వరకు వేగణించాలి. ఇక అందులోనే బెల్లం తురుము వేసుకుని కలపాలి. ఆపై మామిడి గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా వేయించుకోవాలి. ఆలా చేయగా మామిడి గుజ్జు మొత్తం దగ్గరగా వచ్చేలా పాన్కు అట్టుకోకుండా ఉండేలా చేసుకోవాలి. అందులో యాలకుల పొడి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
Indian 2 : ‘ఇండియన్ 2’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..రికార్డులు బద్దలవ్వడం ఖాయం..
ఇక మామిడి పండు మిశ్రమం చల్లారని తర్వాత కాస్త చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు ఉంచుకోవాలి. ఇందుకోసం ముందుగానే కలిపి పెట్టుకున్న చపాతీ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టాలి. ఓ పిండి ముద్దను తీసుకుని వాటిని పూరీల్లా ఒత్తుకుని మధ్యలో ఈ మామిడి పండు పూర్ణాలను పెట్టి పిండి మొత్తాన్ని దగ్గరగా ముడుచుకొని పల్చగా బొబ్బట్లుగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇలా చేసే సమయంలో మామిడి పండు మిశ్రమం బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక స్టవ్ పై పెనం పెట్టి బొబ్బట్లు వేసి నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే వేడి వేడి మామిడి బోబోట్లు రెడీ.