వంతెనలు అనేవి దురాలను తగ్గించడం.. ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేవి. అలాంటి వంతెనపై ఒక నగరం నిర్మిస్తే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే ఏదోలా ఉంది కదా.. ఔను వంతెనపై ఒక యునిక్ నగరాన్ని నిర్మించారు. కింద నీళ్లు కూడా ఉన్నాయి. చూస్తే ఒక అద్భుతమైన దృశ్యంలా కనిపిస్తుంది. అంతేకాదు ఆ వంతెన కింద వాటిని అద్భుతమైన ప్రకృతి దృశ్యంగా మార్చింది. ఇది ఎక్కడో ఉందా తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. మన పక్క దేశం అయిన చైనాలోనే.. చాంకింగ్ లోని లిన్షి టౌన్ షిప్ లో సాంప్రదాయ చైనీస్, పాశ్చాత్య శైలి కలయికతో భనాలను నిర్మించినట్లు ఫోటో గ్రాఫర్ గువోజు తెలిపారు. ఇది పర్యాటకలకు అంతరిక్షం గుండా ప్రయాణిస్తున్న అనుభూతి ఇస్తుందని చెప్పారు.
Imagine living here….. pic.twitter.com/foa7F4jTdC
— Harsh Goenka (@hvgoenka) April 15, 2023
Read Also : Ajit Pawar: బీజేపీతో అజిత్ పవార్ దోస్తీ.. ఒకే అంటే స్వాగతిస్తారట!
ఎప్పుడూ మంచి ప్రేరణనిచ్చే ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తూ సామాజికి మీడియాలో యాక్టివ్ గా ఉండే దిగ్గజ పారిశ్రామికి వేత్త హర్ష గోయెంకా అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు. ఐతే నెటిజన్స్ మాత్రం ఈ వీడియోను చూసి చాలా విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇది అసాధ్యం అని ఊహజనితమైందని ఒకరూ, దీని వల్ల నది జాలాల్లో వ్యర్థాలు ఎక్కువతాయని మరొకరూ కామెంట్ చేస్తూ ట్విట్ చేస్తున్నారు.
Read Also : Hyd Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో మూడు రోజులు వర్ష సూచన
చైనాలోని చాంగ్‌కింగ్‌లో వంతెనపై నిర్మించిన రంగురంగుల టౌన్‌షిప్ యొక్క మనోహరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో ఒక వంతెన పైభాగంలో రంగురంగుల ఇళ్ళు మరియు భవనాలు కనిపిస్తున్నాయి. ఇది 400 మీటర్ల పొడవైన వంతెన చాంగ్‌కింగ్‌లోని లిన్షి టౌన్‌షిప్‌లో సాంప్రదాయ చైనీస్ మరియు పాశ్చాత్య-శైలి భవనాలతో పోలీ ఉంటుంది. అంతరిక్షం గుండా ప్రయాణించడం వంటి విశిష్ట కలయిక పర్యాటకులకు అసాధారణ అనుభూతిని అందిస్తుంది. వీడియోకు ప్రతిస్పందిస్తూ, ఒక వినియోగదారు, సాహసం కంటే తక్కువ ఏమీ లేదు అని వ్రాశారు. ఏరియల్ వ్యూ చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది కానీ #reellife vs #reallife జీవించడం చాలా కష్టం మరొకరు వ్యాఖ్యానించారు. మేము హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ మరియు కిరాణా సామాగ్రిని అక్కడ డెలివరీ చేసినంత కాలం ఇలాంటివి ఉంటాయని ఇంకో నెటిజన్ చమత్కరించాడు.
