NTV Telugu Site icon

Harom Hara : హరోంహర మూవీ టీం బంపర్ ఆఫర్.. రెండు టికెట్స్ కొంటే ఒక టికెట్ ఫ్రీ.. ఎలా అంటే..?

Haromhara

Haromhara

Harom Hara : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న సుధీర్ బాబు గతంలో “ప్రేమ కథా చిత్రం” సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత సుధీర్ బాబు వరుస సినిమాలలో నటించగా ఏ సినిమా కూడా తనకు బ్రేక్ ఇవ్వలేదు.అయితే తాను చేసిన ప్రతి సినిమాకు డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సుధీర్ బాబుకు హిట్ మాత్రం అందని ద్రాక్ష లాగే మిగిలిపోతుంది.అయితే సుధీర్ బాబు ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర”..జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.దర్శకుడు ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు.

Read Also :BB4 : బాలయ్య, బోయపాటి మూవీ లో ఆ హీరోయిన్ ను తీసుకోవాల్సిందే.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్..?

ఈ సినిమాను సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై సుమంత్ నాయుడు గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో సునీల్ ,జయ ప్రకాష్ ,అక్షర ,అర్జున్ గౌడ ,లక్కీ లక్ష్మణ్ వంటి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.ఇదిలా ఉంటే హరోం హర సినిమా రిలీజ్ సందర్భంగా మూవీ టీం బంపర్ ఆఫర్ ఇచ్చింది.రెండు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ ఇచ్చింది మూవీ టీమ్ ప్రకటించింది. ఆన్‍లైన్ ప్లాట్‍ఫామ్ అయిన ‘బుక్ మై షో’లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. “HAROMHARA” అనే కోడ్‍ను అప్లై చేయడం ద్వారా బుక్‍ మై షోలో ఈ ఆఫర్ పొందవచ్చు. బుక్ మై షోలో మూడు టికెట్లను సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసే ముందు HAROMHARA అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే రెండు టికెట్ల ధరకే మూడు టికెట్స్ లభిస్తాయని మూవీ టీమ్ తెలిపింది.

Show comments