NTV Telugu Site icon

IPL 2025: ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?

Ipl 2025

Ipl 2025

IPL 2025: ముంబై ఇండియన్స్ (MI) టీమ్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది. ఈ జట్టు ఇప్పటివరకు 5 ఐపీఎల్ టైటిళ్లను కైవసం చేసుకుని తన సత్తాను చాటుకుంది. ప్రత్యేకంగా, రోహిత్ శర్మ కెప్టెన్సీ హయాంలో ముంబై ఇండియన్స్ అత్యధిక విజయాలను సాధించింది. అయితే, ఐపీఎల్ 2024లో జట్టుకి కొత్త కెప్టెన్‌ను నియమించింది యాజమాన్యం. దైనితో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పండ్యా ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. కానీ, ఐపీఎల్ 2025లో MI తన మొదటి మ్యాచ్ ఆడుతుండగా హార్దిక్ అందుబాటులో ఉండడం లేదు.

Read Also: Realme P3: పవర్‌ఫుల్ ఫీచర్లతో కొత్త మొబైల్స్ను లాంచ్ చేసిన రియల్‌మీ

ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో ఆడనుంది. అయితే, ఆ మ్యాచ్‌లో హార్దిక్ పండ్యా అందుబాటులో ఉండడంలేదు. గత సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. IPL 2024లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన చివరి మ్యాచ్‌లో ఆయన మూడోసారి స్లో ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘించారు. దీంతో, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించబడింది. అందుకే, ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో ఆయన ఆడలేడు.

Read Also: Murder: భర్తను15 ముక్కలుగా నరికి.. సిమెంట్‌తో డ్రమ్ములో సీల్ చేసి ప్రియుడితో జంప్

హార్దిక్ పండ్యా ముంబైలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నేను లేకపోతే, సూర్యకుమార్ యాదవ్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తారని హార్దిక్ వెల్లడించాడు. ఇదివరకు సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు కూడా తాత్కాలిక కెప్టెన్సీ చేసిన అనుభవం కలిగిన ఆటగాడు. ఈ నేపథ్యంలో MI తన తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది.