NTV Telugu Site icon

Guthi Ranganatha Swamy: వైభవంగా గుత్తి శ్రీరంగనాథుడి కళ్యాణోత్సవం

Ranganatha

Ranganatha

అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు బొల్లి కొండ రంగనాథ స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో శ్రీ రంగనాథుడి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో స్వామివారికి వేద మంత్రాల నడుమ ఈ కళ్యాణోత్సవం జరిగింది. స్వామివారికి ప్రత్యేక పుష్పల అలంకరించి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రంగనాథుడి నామస్మరణంతో ఆలయం మారుమోగింది. ఆలయంలో స్వామివారి మూల విరాట్ కు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

Read Also: Revanth Reddy: పాదయాత్రకి బయలుదేరిన రేవంత్.. హారతి ఇచ్చిన కూతురు నైనిషా..

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. రంగనాథుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ ఆలయానికి ఏటా వేలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని చెబుతారు. విజయనగర రాజుల కాలంలోనే ఈ ఆలయం నిర్మించారట. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పెన్నబడి సీమ అని పిలచేవారు. పెమ్మసాని వంశ పాలకులు ఈ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశారు. అప్పటి ప్రభువు రంగనాయకులు. ఆయన పేరుమీద ఇక్కడ స్వామివారిని రంగనాథస్వామి అని పిలుస్తున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తుంటారు.

Read Also: MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ