Site icon NTV Telugu

Love Cheating: ప్రేమ పేరుతో మోసం.. ఎస్సైకి పదేళ్ల జైలు శిక్ష..!

Love Cheating

Love Cheating

Love Cheating: గుంటూరు జిల్లా పోలీస్ శాఖను కుదిపేసిన ఘటనలో.. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్సై రవితేజకు కోర్టు కఠిన శిక్ష విధించింది. నగరంపాలెం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో యువతితో సన్నిహితంగా ఉంటూ.. ఆమెను మోసం చేసిన కేసులో రవితేజ దోషిగా తేలాడు.

Nadendla Manohar: రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలులో ఏపీ ట్రెండ్ సెట్.. 24 గంటల్లోనే నగదు జమ..!

ఈ కేసును విచారించిన గుంటూరు 4వ జిల్లా అదనపు న్యాయస్థానం నిందితుడి చేసిన మోసం రుజువు కావడంతో అతడికి 10 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం అమృతలూరు ఎస్సైగా పనిచేస్తున్నాడు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత దురదృష్టకరమని.. బాధిత యువతికి న్యాయం జరిగిందని, ఇలాంటి ఘటనలకు ఈ తీర్పు గట్టి హెచ్చరిక అంటూ కొందరు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

BCCI Prize Money: విదర్భ టీంపై కాసుల వర్షం.. బీసీసీఐ ఇచ్చిన గిఫ్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Exit mobile version