Site icon NTV Telugu

Insta influencer: బిల్డర్‌ను హనీట్రాప్ చేసిన ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్.. కోట్ల రూపాయల డిమాండ్.. చివరకు

Insta Influencer

Insta Influencer

గుజరాత్‌లో హనీట్రాపింగ్ ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కీర్తి పటేల్‌ను అరెస్టు చేశారు. గుజరాత్‌కు చెందిన ఒక బిల్డర్ నుంచి రెండు కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీర్తి పటేల్‌ను అహ్మదాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న కీర్తి పటేల్‌పై గత ఏడాది జూన్ 2న సూరత్‌లో కేసు నమోదు చేశామని, కొంతకాలం తర్వాత కోర్టు కూడా ఆమెపై వారెంట్ జారీ చేసిందని పోలీసులు తెలిపారు.

Also Read:Trump: ఇరాన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా.. దాడి ప్రణాళికకు ట్రంప్ ఆమోదం

సూరత్‌లో ఓ బిల్డర్‌ను హనీట్రాప్ చేసి, ఆపై బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు పటేల్‌పై ఆరోపణలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో మరో నలుగురి పేర్లు కూడా ఉన్నాయని వారిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. భూ కబ్జా, దోపిడీకి సంబంధించిన ఇతర ఫిర్యాదులలో కూడా ఇన్ఫ్లుయెన్సర్ పటేల్ పేరు ఉందని ఆయన తెలిపారు. సూరత్ కోర్టు జారీ చేసిన వారెంట్ ఉన్నప్పటికీ, పటేల్ పలు పట్టణాలకు మకాం మారుస్తూ.. తన ఫోన్‌లో వేర్వేరు సిమ్ కార్డులను ఉపయోగించి పోలీసులను తప్పించుకుని తిరుగుతోంది.

Also Read:Today Astrology: నేటి దినఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

పోలీసులు నిఘా పెట్టి అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో గుర్తించి పటేల్ ను అరెస్ట్ చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. కీర్తి పటేల్‌ను 10 నెలలుగా ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మా సాంకేతిక బృందం, సైబర్ నిపుణుల సహాయంతో, అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్‌లో ఆమె స్థానాన్ని ట్రాక్ చేసాము. అహ్మదాబాద్‌లోని మా కౌంటర్‌పార్టీలను సంప్రదించి ఆమెను అరెస్టు చేసాము. ఆమెపై హనీట్రాప్, దోపిడీ ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

Exit mobile version