NTV Telugu Site icon

Road Accident: గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 55 మంది మృతి

Road Accident

Road Accident

Road Accident: సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన గ్వాటెమాలా రాజధానికి సమీపంలోని ప్రాంతంలో జరిగింది. ఓ ప్రయాణికుల బస్సు నియంత్రణ కోల్పోయి 65 అడుగుల లోతైన ప్రాంతనంలో పడిపోయింది. అందిన సమాచారం మేరకు ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 55 మంది మృతి చెందారు. మరికొంత గాయపడ్డారు.

Read Also: Harbhajan-Akhtar: గ్రౌండ్ లోనే బాహాబాహీకి దిగిన హర్భజన్ సింగ్, అక్తర్.. వీడియో వైరల్

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదం పలు వాహనాల ఢీకొన్న ఘటన (Multi-Vehicle Collision) వల్ల చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ముందుగా పలు వాహనాలను ఢీకొట్టి చివర్లో ఓ లోతైన ప్రాంతంలోకి పడిపోయింది. ప్రమాదంలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లోయలో పడిన బస్సు లోయలో పడి నీటిలో సగం మునిగినట్లు కనిపిస్తోంది.

Read Also: Munna Bhai: మున్నా భాయ్ 3లో నాగార్జున..?

సమాచారం ప్రకారం, ప్రమాదానికి గురైన బస్సు 30 సంవత్సరాల పాతదని, అయినప్పటికీ ఇంకా సర్వీసులో ఉండేందుకు లైసెన్స్ ఉన్నట్లు గ్వాటెమాలా ఇన్ఫర్మేషన్ మంత్రి మిగ్వెల్ ఆంజెల్ డియాజ్ తెలిపారు. ఇప్పటి వరకు 55 మృతదేహాలను వెలికితీసారు. మరణించిన వారిలో 38 మంది పురుషులు, 17 మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణ ఘటన దేశమంతటినీ షాక్‌కు గురిచేసింది. గ్వాటెమాలా రాష్ట్రపతి బర్నార్డో ఆరేవాలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఒక రోజు జాతీయ సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటాయని హామీ ఇచ్చారు.