NTV Telugu Site icon

Peddamma Thalli Temple: పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా శాకాంబరి ఉత్సవాలు.. రెండో రోజు ఇలా..

Jubliee Hills Pedamma

Jubliee Hills Pedamma

కొలిచినవారి కొంగు బంగారం పెద్దమ్మ తల్లి.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కొలువుదీరన పెద్దమ్మ తల్లి ఆలయంలో.. అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజులపాటు శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి.. సామాన్యంగా.. మనందరికి తెలిసిన ప్రకారం వివిధ కూరగాలతో అలంకరించి పూజిస్తారు కనుక ఈ తల్లిని శాకాంబరీదేవి అంటారు.. ఈ విధంగా పంట తొలిదశలో ఉన్న సమయంలో అమ్మవారిని పూజించడం వలన పంటలు సమృద్ధిగా పండుతాయని, పాడిపంటలకు లోటుండదని భక్తుల విశ్వాసం.. ఆహారాన్ని లోటులేకుండా ప్రసాదించే చల్లని తల్లి ఈ శాకాంబరిదేవి శతాక్షిఅని పిలుస్తారు.. ఇక, క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ సప్తమి అనగా జులై 13వ తేదీ శనివారం మొదలై.. ఆషాఢ శుద్ధ నవమి తేదీ 15వ తేదీ సోమవారం వరకు శ్రీ పెద్దమ్మ దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి.. తొలిరోజులో భాగంగా ఈ రోజు అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు..

జీవకోటికి ఆకలిని తీర్చిన శాకాంబరి దేవి.. సామాన్యంగా! మనందరికి తెలిసిన ప్రకారం వివిధ కూరగాయలతో అలంకరించి, పూజిస్తారు కనుక ఈ తల్లిని శాకాంబరీదేవి అంటారు. ఈ విదంగా పంట తొలిదశలో వున్న సమయములో అమ్మవారిని పూజించడం వలన పంటలు సమృద్ధిగా పండుతాయని, పాడిపంటలకు లోటుండదని విశ్వాసం. ఆహారాన్ని లోటులేకుండా ప్రసాదించే చల్లని తల్లి ఈ శాకాంబరిదేవి శతాక్షిఅని కూడా! పిలుస్తారు. ముఖ్యంగా దేవీభాగవత పురాణంలో ఒకానొక కాలంలో క్షామం ఏర్పడి దేవతలు, ఋషులు, మానవులు, నానా అవస్థలు పడుతున్నారు. దుర్మార్గుడైన అసురుడు దుర్గమాసురుడు ఋషులు వేదాలను మరచిపోయేలా చేయడం ద్వారా భూమికి పోశనశక్తిని కోల్పోయిన తర్వాత దేవతలు, ఋషులు, వారి వారి శక్తులను కోల్పోయి మరియు మానవులు, పశుపక్షాదులు, ఆహారం దొరకక నానా అవస్థలు పడుతున్నారు. ఆ సమయములో దేవతలు, ఋషులు అమ్మవారిని ప్రార్థించారు అప్పుడు ఆ చల్లని తల్లి ప్రత్యక్షమై, ఈ లోకములో జరుగుతున్న అవస్థలు చూసి, శతాక్షిగా మారి వర్షాన్ని కురిపించి తన శరీరం నుంచి దుంపలు, కూరలు, పండ్లు, మొదలైన శాకాహారాన్ని లోకానికి అందించి ఆకలిని తీర్చి, అసుర సంహారం చేసి ఋషులకు వేదాలను, దేవతలకు శక్తులనొసంగి, క్షామ నిర్మూలనచేసి భూమి సస్యశ్యామలంగా ఉండేలా అనుగ్రహించిన ఆ చల్లని తల్లి శాకాంబరీదేవి. అట్టి శాకాంబరి దేవి రూపములో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లిని చక్కగా శ్రద్దాబక్తితో పూజించి ఆ తల్లి కృపాకటాక్షములను పొందగలరు.

ఈ రోజు కార్యక్రమాల విషయానికి వస్తే..
* ఉదయం 3 గంటలకు శ్రీ పెద్దమ్మ వారికి అభిషేకం
* ఉదయం 6 గంటలకు దర్శనము, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం
* ఉదయం 9 గంటలకు మండప దేవతా పూజలు సప్తశతి పారాయణము వేదపారాయణము, అరుణపారాయణము, స్థాపిత దేవతాహననములు, రుద్రాభిషేకములు
* మధ్యాహ్నం 1గంటలకు మహానివేదన, హారతి, మంత్రపుష్పము
* సాయంత్రం 5గంటలకు మంటప పూజలు, వేద పారాయణము, సప్తశతి పారాయణములు, దేవి భాగవత పారాయణము, రుద్రహోమములు, మూలమంత్ర అనుష్ఠాన హెూమములు.
* రాత్రి 8 గంటలకు హారతి, మంత్ర పుష్పము, శ్రీ పెద్దమ్మవారి ఉత్సవమూర్తి పల్లకి సేవ, తీర్థప్రసాద వినియోగములు.. ఇలా వివిధ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు.