Surrogacy Mother: ప్రపంచవ్యాప్తంగా చాలా విచిత్రమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. కొన్ని బంధాలు వింటుంటే వింతగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ అమ్మ తన కొడుకు సంతానానికి జన్మ నిచ్చింది అదికూడా ఆమె వయస్సు 56ఏటా. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. నాన్సీ హాక్ అమె మహిళ తన మనవడికి నవంబర్ 2022లో జన్మనిచ్చింది. నిజానికి, నాన్సీ కోడలు కాంబ్రియా 2021లో కవలలకు జన్మనిచ్చింది. ఈలోగా, ఆమెకు గర్భాశయ శస్త్రచికిత్స జరిగింది. ఆ సమయంలో కాంబ్రియా ప్రాణాలకు ముప్పు పొంచిఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Also: Mrs. Chatterjee Vs Norway: కన్న బిడ్డల కోసం కర్కశమైన దేశంలో ఒక తల్లి పోరాటం
నాన్సీ కొడుకు జెఫ్, కోడలు కాంబ్రియా మరో బిడ్డ కోసం ప్లాన్ చేసుకున్నారు. అయితే వైద్యపరమైన సమస్యల కారణంగా అది కుదరలేదు. తన కోడలి కోర్కెను తీర్చేందుకు నాన్సీ తన 33ఏళ్ల కొడుకుతో మాట్లాడింది. సరోగసి ద్వారా బిడ్డను జన్మనిచ్చేందుకు ఒప్పించింది. అయితే నాన్సీకి ఇప్పటికే 56 ఏళ్లు అయితే సరోగసి ద్వారా నాన్సీకి బిడ్డలు పుట్టే చాన్స్ వుంటుందా? అనే అనుమానాలు వచ్చాయి. దీంతో వైద్యులను సంప్రదించి బిడ్డను కనేందుకు కోడలు, అత్త డాక్టర్ దగ్గరకు వెళ్లారు. వైద్యులకు వారు అనుకున్నదంతా వివరించారు. అదివిన్న వైద్యులు షాక్ తిన్నారు. నాన్సీని వైద్య పరీక్షలు చేసి ఏ విషయంపై క్లారిటీ ఇస్తామని అనడంతో.. కాస్త విచారించినా నాన్సీని పరీక్షించిన వైద్యులు శుభవార్తే చెప్పారు. నాన్సీ సరోగసి ద్వారా బిడ్డను కనేందుకు అవకాశం ఉందని చెప్పడంతో కోడలు, అత్త నాన్సీ ఆనందం వ్యక్తం చేశారు.
Read Also: HBD: తమ్ముడి గురించి కాలభైరవ ఎమోషనల్ ట్వీట్!
ఆ విధంగా, నవంబర్‌లో నాన్సీ తన కొడుకు సంతానానికి జన్మనిచ్చింది. దీంతో నాన్సీ భర్త జాసన్ మాట్లాడుతూ.. పిల్లవాడు పూర్తిగా సురక్షితంగా ఉంటారని ఊహించలేదన్నారు. కానీ అది సాధ్యమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శిశువు బాగా అభివృద్ధి చెందడంతో దాని గురించి ఆందోళన తగ్గిందని తెలిపారు. నాన్సీ కోడులు మాట్లాడుతూ.. నేను ఈ బిడ్డను కోల్పోతానని నిత్యం బాధపడేదానిని అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. కానీ అంతా బాగానే జరిగిందని ఆనందం వ్యక్తం చేసింది. తన అత్తగారు బిడ్డను జన్మనివ్వడంతో కోడలు కాంబ్రియా ఆనందం అవధుల్లేవు. ఈ అనుభవం నేను దాల్చిన గర్భం కంటే చాలా భిన్నంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది.
Top Headlines @1PM : టాప్‌న్యూస్
