NTV Telugu Site icon

Harom Hara : గ్రాండ్ గా హరోం హర ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులు ఎవరో తెలుసా ..?

Haromhara

Haromhara

Harom Hara : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గతంలో “ప్రేమ కథా చిత్రం” సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత సుధీర్ బాబు వరుస సినిమాలలో నటించగా ఏ సినిమా కూడా తనకు బ్రేక్ ఇవ్వలేదు.సినిమా సినిమాకు డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సుధీర్ బాబుకు హిట్ మాత్రం లభించడం లేదు.ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర “..జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Read Also :Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ నుండి రిలీజ్ కానున్న మరో ట్రైలర్..?

ఈ సినిమాను సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో సునీల్ ,జయ ప్రకాష్ ,అక్షర ,అర్జున్ గౌడ ,లక్కీ లక్ష్మణ్ వంటి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లోని హోటల్ దస్పల్లాలో నేడు సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్స్ సిద్దు జొన్నలగడ్డ,అడివి శేష్ ,విశ్వక్ సేన్ గెస్టులుగా రానున్నట్లుగా తాజాగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.

Show comments