నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇంటర్ అర్హతతో భారీ జీతంతో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం, ట్రైనీ పైలట్ ఉద్యోగాల కోసం మే 13న రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూన్ 10 వరకు చివరి తేదిగా ప్రకటించారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం, చివరి తేదీ ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అర్హతలు..
గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో 12వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.. ఇండియన్స్ అయి ఉండాలి..
వయోపరిమితి..
ట్రైనీ పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయసు 30 ఏళ్లు, గరిష్ట వయసు 40 ఏళ్లు వరకు ఉండాలి..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఈ పోస్టుల పై అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు అధికారిక వెబ్‌సైట్ cabsec.gov.in ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్ణీత ఫార్మాట్‌లో ఫారమ్ నింపాలి.. ఆ తర్వాత అడ్రెస్ లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీసర్, న్యూఢిల్లీ-110003′ అడ్రస్‌కు పంపించాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు..
వేతనం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1.52 లక్షల జీతం ఉంటుంది..
ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను సందర్శించాలి..