NTV Telugu Site icon

Devara Team : ‘ఫియర్ సాంగ్’ ప్రతి లైన్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ..

Whatsapp Image 2024 05 19 At 12.35.22 Pm

Whatsapp Image 2024 05 19 At 12.35.22 Pm

Devara Team : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్సె వీడియో రిలీజ్ చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈ చిత్రం నుండి “ఫియర్ సాంగ్” ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన “ఫియర్ సాంగ్” ప్రోమో..సాంగ్ పై విపరీతమైన అంచనాలు పెంచింది.నేడు సాయంత్రం 7 .02 గంటలకు మేకర్స్ ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ట్వీట్ చేస్తూ ఈ పాటలోని ప్రతీ లైన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని తెలిపింది.గేయ రచయితలు బ్లేడ్ లాగా ప్రతీ లైన్ ను చెక్కుతూ రాసారని పేర్కొంటూ రచయితల పేర్లను వెల్లడించింది.ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి ,తమిళంలో విష్ణు ఏడవన్ ,హిందీలో మనోజ్ ముంతాషిర్,కన్నడలో ఆజాద్ వరదరాజ్,మలయాళంలో ఎం.గోపాలకృష్ణన్ రచించినట్లు పేర్కొంది.