ఎన్ని రకాల వ్యాధులు వచ్చిన నయం చెయ్యడానికి మందులు ఉన్నాయి.. కానీ షుగర్ వ్యాధి వస్తే జన్మలో పోదు.. ఎంతసేపు కంట్రోల్ చేసుకోవడమే.. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం.. షుగర్ పేషంట్స్ కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను అభివృద్ధి చేశారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ అవసరాలను తీర్చే చాక్లెట్.. ఈ చాక్లేట్స్ ను యూఐటీ ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ లు తయారు చేశాయి.. ఇక ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.. అందులో 7 కోట్లకు పైగా ఇన్సులిన్ ఇంజక్షన్ లను తీసుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి.. ఇక ఇన్సులిన్ తీసుకొనే పనిలేకుండా మధుమేహం చికిత్సలో సహాయపడే ఔషధం తయారు చేశారు. ఈ ఇన్సులిన్ చాక్లెట్ ఎలా పని చేస్తుందో చూద్దాం..
ఈ చాక్లెట్‌లో మానవ వెంట్రుకల కంటే చిన్న పరిమాణంలో ఉండే నానో క్యారియర్‌లు ఉంటాయి. వీటిలో ఇన్సులిన్ ఉంటుంది. శరీరం తగినంత పరిమాణంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు, మన రక్తంలో ఉన్న చక్కెరను ప్రాసెస్ చేయడం సాధ్యం కాదు. కణాలలోకి వెళ్లే బదులు ఆ చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది.. ఈ కొత్త చాక్లేట్ ఇన్సులిన్ సమతుల్యతను పెంచేందుకు సహాయపడుతుంది..
ఈ చాక్లేట్ లు ఎలా పనిచేస్తాయంటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు, ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌లు చురుకుగా మారి ఆ పూతను విచ్ఛిన్నం చేస్తాయి. పూత కరిగిపోయనప్పుడు ఇన్సులిన్ విడుదల చేస్తుంది. ఇది రక్తం నుండి చక్కెరను తొలగించడానికి పని చేస్తుంది.. బాడిలో షుగర్ పెరిగితే ఆటోమెటిక్ గా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది.. ఈ చక్కెర రహిత చాక్లెట్‌ను డయాబెటిక్ ఎలుకల పై కూడా పరీక్షించారు. వాటిలోనూ సానుకూల ప్రభావం కనిపించింది. ఇప్పటివరకు ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. నివేదికల ప్రకారం, ఇది 2025 లో మానవుల పై పరీక్షించనున్నారు.. అంటే మరో రెండు, మూడేళ్లలో మార్కెట్ లోకి రానున్నాయి..