NTV Telugu Site icon

Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో రైలుకు గోల్డెన్ పీకాక్ అవార్డు

Hyderabad Metro

Hyderabad Metro

అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను పాటించడంలో గల నిబద్ధతకు గాను ట్రాన్స్‌పోర్టేషన్ (రైల్వేస్) కేటగిరీలో ఆక్యుపేషనల్ హెల్త్ & సేఫ్టీకి సంబంధించి గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని (GPOHSA) ఎల్&టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) దక్కించుకుందని తెలియజేసేందుకు సంతోషిస్తోంది.

అత్యుత్తమ భద్రత ప్రమాణాలు , పని ప్రదేశంలో ఆరోగ్యకరమైన పరిస్థితులను పాటించడానికి ప్రాధాన్యతనివ్వడంపై మా యావత్ బృందం చేస్తున్న నిరంతర కృషికి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలుస్తుంది. “మా ఉద్యోగుల భద్రత, సంక్షేమం విషయంలో మాకు గల ఎనలేని నిబద్ధతకు ఈ పురస్కారం నిదర్శనంగా నిలవగలదు. ఇది మాకు ఎంతో స్ఫూర్తినిస్తూ, భద్రతలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పే దిశగా నిరంతరం కృషి చేసేలా ప్రోత్సాహకరంగా ఉండగలదు” అని ఎల్ & టీ ఎంఆర్‌హెచ్ఎల్ ఎండీ , సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు.

బెంగళూరులో ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక “ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD’s) 25వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్” కార్యక్రమంలో పురస్కారాల ప్రదానం జరిగింది. మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీయుత ఉదయ్ యు. లలిత్, కర్ణాటక హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థి అవార్డులను ప్రదానం చేశారు.

మొత్తం 778 దరఖాస్తులు రాగా తీవ్రమైన పోటీలో విజేతగా నెగ్గిన L&TMRHL, అత్యుత్తమ భద్రతా ప్రమాణాల పాటింపులో దిగ్గజంగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అవార్డుల జ్యూరీకి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వం వహించడం ఈ పురస్కారానికి మరింత వన్నె తెచ్చింది.

L&TMRHLలో ప్రత్యక్షంగా 126 మంది పైగా ఉద్యోగులు, మొత్తం 2,600 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. సిబ్బంది భద్రత విషయంలో సంస్థకు గల నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తుంది. GPOHSAను దక్కించుకోవడమనేది, పరిశ్రమలోనే అత్యంత కఠినతరమైన సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ (SHE) ప్రమాణాలను పాటించడంలో కంపెనీకి గల నిబద్ధతను చాటి చెబుతోంది.

హైదరాబాద్ మెట్రో రైల్ కార్యకలాపాలవ్యాప్తంగా సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న, ఎనలేని తోడ్పాటు అందిస్తున్న మా భాగస్వాములందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను కొనసాగించడంలో మేము నిరంతరం కృషి చేసేందుకు ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం మాకు ఎంతో ప్రేరణనివ్వగలదు” అని పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా శ్రీ కేవీబీ రెడ్డి తెలిపారు.