బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. నవంబర్ మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ రికార్డు స్థాయిలో దిగొచ్చిన గోల్డ్ రేట్స్.. మరలా పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.600పెరగగా.. నేడు రూ.700 పెరిగింది. 24 క్యారెట్లపై నిన్న రూ.660 పెరగగా.. నేడు రూ.770 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,650గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.77,070గా నమోదైంది.
ఇటీవలి రోజుల్లో తగ్గుతూ వచ్చి.. వరుసగా నాలుగు రోజులు స్థిరంగా ఉన్న వెండి నేడు భారీగా పెరిగింది. మంగళవారం కిలో వెండిపై రూ.2000 పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి మరలా లక్ష దాటింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.91,500 వేలుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,650
విజయవాడ – రూ.70,650
ఢిల్లీ – రూ.70,800
చెన్నై – రూ.70,650
బెంగళూరు – రూ.70,650
ముంబై – రూ.70,650
కోల్‌కతా – రూ.70,650
కేరళ – రూ.70,650
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,070
విజయవాడ – రూ.77,070
ఢిల్లీ – రూ.77,220
చెన్నై – రూ.77,070
బెంగళూరు – రూ.77,070
ముంబై – రూ.77,070
కోల్‌కతా – రూ.77,070
కేరళ – రూ.77,070
Also Read: Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’లో 11వ రోజు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
ఢిల్లీ – రూ.91,500
ముంబై – రూ.91,500
చెన్నై – రూ.1,01,000
కోల్‌కతా – రూ.91,500
బెంగళూరు – రూ.91,500
కేరళ – రూ.1,01,000